Home తెలంగాణ ఓటీటీలోకి హాలీవుడ్ సూపర్‌హిట్ క్రైమ్ థ్రిల్లర్.. గాల్ గాడోట్ ‘ది రన్నర్’ స్ట్రీమింగ్

ఓటీటీలోకి హాలీవుడ్ సూపర్‌హిట్ క్రైమ్ థ్రిల్లర్.. గాల్ గాడోట్ ‘ది రన్నర్’ స్ట్రీమింగ్

0

ప్రతి వారం మాదిరిగానే ఈ వీకెండ్‌ కూడా థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన ‘పళ్ల బురుసు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’, లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’, మాధవన్ ‘జీడీఎన్’, ‘ఉన్మాదం’, ‘గాంధారి’ వంటి సినిమాలు, ‘జగమే సంగీతం’, ‘ది కోర్ట్’ వంటి వెబ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

అయితే వీటన్నింటికంటే ముందే ఓ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 2, బుధవారం నుంచే ‘ది రన్నర్’ (The Runner) డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చింది.

గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో..

‘వండర్ వుమన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాల్ గాడోట్ ‘ది రన్నర్’లో ప్రధాన పాత్ర పోషించింది. ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు.

లండన్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

కొడుకును కాపాడుకోవడానికి తల్లి పోరాటం..

‘ది రన్నర్’ కథ విషయానికొస్తే.. లండన్‌లో తన కొడుకుతో కలిసి జీవించే ఓ మహిళ అతడిని రోజూ మాదిరిగానే స్కూల్‌లో దింపి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే కొద్దిసేపటికే ఆమెకు ఓ కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది.

తన కొడుకు తన అదుపులో ఉన్నాడని చెప్పిన కిడ్నాపర్.. అతడిని సురక్షితంగా తిరిగి అప్పగించాలంటే తాను చెప్పిన పనులన్నింటినీ కేవలం గంటలో పూర్తి చేయాలని ఆమెను బెదిరిస్తాడు.

అసలు ఆ తల్లి కిడ్నాపర్ చెప్పిన పనులను పూర్తి చేసిందా? తన కొడుకును కాపాడుకోగలిగిందా? ఆ ఒక్క గంటలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.

క్రైమ్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిపోయే సినిమాలను ఇష్టపడే వారికి ‘ది రన్నర్’ మంచి వీకెండ్ వాచ్‌గా నిలిచే అవకాశం ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version