Home తెలంగాణ ఘనంగా పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...

ఘనంగా పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

0

TGN NEWS (పటాన్‌చెరు): నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ పట్ల ఆయన కట్టుబాటును ప్రతిబింబించారు. తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రాధమిక పాఠశాల చిన్నారుల కోసం రెండు వాటర్ ప్యూరిఫైయర్లను ఆయన కుమారుడు లవణ్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్ మరియు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గణేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు శ్రీనివాస్ మాట్లాడుతూ — “రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు” అని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version