Home తెలంగాణ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్రంతో కీలక చర్చలు.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ఫోకస్

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్రంతో కీలక చర్చలు.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ఫోకస్

0

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన సీఎం, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై గోదావరి-కృష్ణా నదీ జలాల పంపిణీ, ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠాన నాయకులతో కూడా సీఎం సమావేశం కానున్నారని సమాచారం. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కర్ణాటకలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసి, మంత్రిపదవుల ఆశావహుల అసంతృప్తిని తగ్గించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశాలపై ఆసక్తి నెలకొంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version