తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా బుల్లితెరపై సందడి చేశారు. ఈ సీజన్‌లో సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు.. ‘అగ్నిపరీక్ష’ ప్రక్రియ ద్వారా ఎంపికైన సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం లభించింది.
గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరు తమదైన శైలిలో పరిచయం చేసుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లు వీరే..
1. దేబ్జానీ మోదక్: ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దేబ్జానీ.. ‘గిరగిరా గింగిరాని వే’ పాటకు డ్యాన్స్ చేస్తూ తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
2. త్రిగుణ్: గతంలో అదిత్ అరుణ్ పేరుతో సినిమాలు చేసిన త్రిగుణ్.. ఇప్పుడు కొత్త పేరుతో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలనే లక్ష్యంతో షోలోకి వచ్చినట్లు తెలిపారు.
3. ఝాన్సీ: సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ గోల్డెన్ టికెట్ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించారు. ‘రైతు బిడ్డ’ పాటను భావోద్వేగంగా పాడి ఆకట్టుకున్నారు.
4. సుధీర్ రెడ్డి (సుధీర్ టాక్స్): సోషల్ మీడియాలో పాడ్‌కాస్టర్‌గా గుర్తింపు పొందిన సుధీర్.. తన జీవితంలోని కష్టాలను నాగార్జునతో పంచుకున్నారు.
5. అమన్: ‘అగ్నిపరీక్ష’లో అత్యధిక ఓట్లు సాధించి బిగ్ బాస్ అవకాశం దక్కించుకున్నారు. గేమ్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ తన నిర్ణయాన్ని మార్చుకోనని ధీమా వ్యక్తం చేశారు.
6. చైత్ర రాయ్: ‘అష్టాచమ్మా’ సీరియల్‌లో స్వప్నగా గుర్తింపు పొందిన చైత్ర.. పెళ్లి తర్వాత బరువు పెరగడంపై వచ్చిన ట్రోలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని 20 కిలోలు తగ్గినట్లు తెలిపారు.
7. ఆటో రామ్ ప్రసాద్: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రామ్ ప్రసాద్ తన కామెడీ పంచ్‌లతో హౌస్‌లోకి ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చారు.
8. షాలిని: జ్యూరీ సభ్యుడు నవీన్ ఎంపిక చేసిన సామాన్యురాలిగా షాలిని బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. తాను ఎక్కువగా మాట్లాడతానని చెప్పుకుంటూ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు.
9. టెంపర్ వంశీ: ‘టెంపర్’, ‘నేనింతే’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన వంశీ.. తనలోని ఎమోషనల్, ఫ్యామిలీ మ్యాన్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో షోలోకి వచ్చినట్లు చెప్పారు.
10. సృష్టి వ్యాకరణం: మాజీ కంటెస్టెంట్ శ్రీముఖి ఎంపిక చేసిన సృష్టి.. తన సంకల్పమే తన బలమని, ఇతరులను సులభంగా నమ్మడం తన బలహీనత అని తెలిపారు.
11. నరేశ్ (పొట్టి నరేశ్): జబర్దస్త్ ఫేమ్ నరేశ్.. తన పేరు గూగుల్‌లో వెతికితే ‘బిగ్ బాస్ 10 నరేశ్’ అని రావాలనేదే తన లక్ష్యమని తెలిపారు.
12. ఆర్జే చరణ్: ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎంపికైన ఆర్జే చరణ్.. తన చుట్టూ ఉన్నవారిని నవ్వించడమే తన బలమని చెప్పారు. చిరంజీవి, నాగార్జునకు తాను వీరాభిమానినని తెలిపారు.
13. కృష్ణుడు: ‘హ్యాపీ డేస్’, ‘వినాయకుడు’ సినిమాలతో గుర్తింపు పొందిన కృష్ణుడు.. తన బరువు వెనుక ఉన్న కథను వెల్లడించారు. తాను అమాయకుడిని కాదని, తనలోని మరో కోణాన్ని చూపిస్తానని చెప్పారు.
14. వర్షిణి సౌందరరాజన్: యాంకర్, నటిగా గుర్తింపు పొందిన వర్షిణి.. తొలుత బిగ్ బాస్‌పై పెద్దగా ఆసక్తి లేకపోయినా, ఆ తర్వాత షోపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.
15. రోహిత్: జ్యూరీ సభ్యురాలు బిందు మాధవి ఎంపిక చేసిన సామాన్య యువకుడు రోహిత్. హౌస్‌లో ఒకరిపై నీళ్లు చల్లే టాస్క్‌ను సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.
16. ముఖేశ్ గౌడ: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముఖేశ్ గౌడ 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు తన గుండెల్లో ఉందని చెబుతూ.. తన తెలుగు తప్పులు ఉంటే క్షమించాలని ప్రేక్షకులను కోరారు.
ఇలా సినీ, టీవీ, సోషల్ మీడియా, యాంకరింగ్, కామెడీతో పాటు సామాన్యుల నుంచి ఎంపికైన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా మొదలైంది. సుమారు వంద రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో ఎవరు తమ ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తారు? ఎవరు టైటిల్‌ను సొంతం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
