Home తెలంగాణ మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు పెంటయ్య అరెస్ట్…! సంతానం కల్పిస్తానంటూ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు..!

మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు పెంటయ్య అరెస్ట్…! సంతానం కల్పిస్తానంటూ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు..!

0
  • మేడ్చల్‌లో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. SOT దాడుల్లో అరెస్టు
  • సంతానం కల్పిస్తానంటూ మోసం.. నకిలీ డాక్టర్ అరెస్టు
  • వైద్య శాఖ అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహణ.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడిపై కేసు

TGN NEWS (మేడ్చల్): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) నిర్వహించిన దాడుల్లో నకిలీ వైద్యుడు పెంటయ్య అరెస్టయ్యాడు. ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఓ మహిళా వైద్యురాలి ధృవపత్రాన్ని ఉపయోగిస్తూ యదేచ్ఛగా వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మేడ్చల్ పట్టణంలోని “శివరామకృష్ణ డే కేర్ సెంటర్” పేరిట క్లినిక్ నిర్వహిస్తున్న పెంటయ్య, సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగేలా చికిత్స చేస్తానంటూ ఇంజెక్షన్లు ఇస్తూ వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కుత్బుల్లాపూర్ SOT పోలీసులు దాడులు చేపట్టారు.

దాడుల సమయంలో పెంటయ్య ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలోనే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ మెడికల్ షాప్ నిర్వహించడమే కాకుండా, వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ ఉమాగౌరి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ జరుపుతున్నారు.

అనుమతులు లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవడం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version