Home తెలంగాణ విజయ్‌ను సీఎం చేసింది సినిమా ఇమేజ్ కాదు.. ప్రజల్లో మార్పు కోరిక: విశాల్

విజయ్‌ను సీఎం చేసింది సినిమా ఇమేజ్ కాదు.. ప్రజల్లో మార్పు కోరిక: విశాల్

0

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో సాధించిన విజయంపై నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లింది కేవలం ఆయనకున్న సినిమా ఇమేజ్ కాదని.. ప్రజల్లో ఉన్న మార్పు కోరిక, ఆయనపై ఏర్పడిన నమ్మకమే అందుకు ప్రధాన కారణమని విశాల్ అభిప్రాయపడ్డారు.

గతంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయారని విశాల్ గుర్తుచేశారు. శివాజీ గణేశన్, కే. భాగ్యరాజ్, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖుల ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. విజయ్ విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు.

విజయ్‌లో మార్పు లేదు

ఇటీవల ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన సందర్భాన్ని కూడా విశాల్ గుర్తుచేసుకున్నారు. సీఎం హోదా వచ్చినప్పటికీ విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిపారు.

“హోదా మాత్రమే మారింది.. మనిషిగా విజయ్‌లో ఎలాంటి మార్పు రాలేదు” అన్న భావనను విశాల్ వ్యక్తం చేశారు. ప్రజలతో విజయ్‌కు ఉన్న అనుబంధమే ఆయన రాజకీయ ప్రయాణంలో కీలకంగా మారిందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఆ మాట ప్రభావం

ఎన్నికల ప్రచారం చివరి రోజున విజయ్ చేసిన పిలుపు ఓటర్లపై బలమైన ప్రభావం చూపిందని విశాల్ అన్నారు.

“మీ తల్లిదండ్రులకు, ఇళ్లలోని పెద్దలకు చెప్పి ఒక్కసారి నాకు ఓటు వేయమని కోరండి” అంటూ విజయ్ చేసిన విజ్ఞప్తి ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు.

విజయ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. ఎన్నో ఏళ్లుగా ప్రజలతో ఏర్పరచుకున్న కనెక్టివిటీ కారణంగానే రాజకీయాల్లోనూ ఆయనకు ఆదరణ లభించిందని విశాల్ అభిప్రాయపడ్డారు.

‘మకుటం’తో దర్శకుడిగా విశాల్

ఇక సినిమాల విషయానికి వస్తే.. విశాల్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మగుడం’. తెలుగులో ఈ సినిమా ‘మకుటం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. దర్శకుడిగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version