Home తెలంగాణ శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

0

TGN NEWS (పటాన్‌చెరువు) : అమీన్పూర్ మండలం, పటేల్‌గూడ సుజనా లక్ష్మి ఫేస్–2 కాలనీ మహిళామూర్తుల ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్‌కు కాలనీ నాయకులు, మహిళలు అందజేశారు.ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ –
“గత ఐదు సంవత్సరాలుగా మీరు కలసి దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం గర్వకారణం. మహిళలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండి సత్సేవలు చేయడం నిజంగా సనాతన ధర్మానికి గొప్ప సేవ. ప్రతి కాలనీ, ప్రతి సొసైటీ కూడా ఇలాగే ఉత్సాహంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని నా మనస్పూర్తి కోరిక. దుర్గామాత ఆశీస్సులతో మన అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version