Home తెలంగాణ 14మండలాలకు అందరూ ఇంచార్జి ఎంఈఓలే

14మండలాలకు అందరూ ఇంచార్జి ఎంఈఓలే

0

* పాఠశాలలు ప్రారంభమైన భర్తీ కానీ ఎంఈఓ పోస్టులు

* హెడ్మాస్టర్లకు అదనపు బాధ్యతలు

* రెగ్యులర్ ఎంఈఓ ల నియమించాలని డిమాండ్లు

* విద్యాశాఖ పై ఎందుకంత నిర్లక్ష్యం అంటూ విద్యార్థి సంఘ నాయకుల ఆగ్రహం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ పోస్టులన్నీ ఇంచార్జి ల పాలనలోనే సాగుతున్నాయి. పాఠశాలల ప్రారంభమైన ఎంఈఓ ల పోస్టులను మాత్రం భక్తి చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ హెడ్మాస్టర్లకు మండల విద్యాశాఖ అధికారి( ఎంఈఓ) అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేయగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా విద్యాశాఖకు ప్రాధాన్యత లభిస్తుందని అని అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురి అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏ ఉదాహరణ. పాఠశాలల ప్రారంభమై దాదాపు దాదాపు రెండు వారాలు గడుస్తున్నా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇంతవరకు రెగ్యులర్ ఎంఈఓ పోస్టు ల ను మంజూరు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ హెడ్మాస్టర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో నిర్వహణ తీరు ఉపాధ్యాయుల సమయపాలన విద్యా బోధన లో వసతుల కల్పన మధ్యాహ్న భోజన అమలు ఇతర విషయాలను మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్య ప్రమాణాలు పెంచి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఎంఈవోల పర్యవేక్షణ తప్పనిసరి. ఇంత పెద్ద బాధ్యతలు కలిగి ఉన్న ఎంఈఓ పోస్టులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కు మంజూరు కాకపోవడం శోచనీయం. గత కొన్ని నెలల నుండి ఇంచార్జ్ లతోనే కాలం వెలదీశారు.

రెండు బాధ్యతలతో
ఉక్కిరిబిక్కిరి

సీనియర్ హెడ్మాస్టర్లకు ఎంఈఓ ల బాధ్యతలు అప్పగించడం వల్ల వారు బోధన చేయలేక… ఇటు ఎంఈఓ బాధ్యతలను నిర్వర్తించలేక ఇంచార్జ్ ఎంఈఓ లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు., ఇంచార్జ్ ఎంఈఓ లుగా అదనపు బాధ్యతలు ఉండడం వల్ల రెండిటికి న్యాయం చేయలేకపోతున్నామని, దీనివల్ల విద్యా ప్రమాణాలు పెంపొందించలేక పోతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎంఈఓ పేర్కొన్నారు. తమకు ఎంఈఓ బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

14మండలాలకు అందరూ
ఇంచార్జ్ లే

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ ఒక్కరంటే ఒక్క రెగ్యులర్ ఎంఈఓ లేరు. ఏండ్ల తరబడి ఇంచార్జ్ పాలనలోనే నెట్టుకొస్తున్నారు. మండల విద్యా వ్యవస్థలో ఎంఈవోల పాత్ర కీలకం. అలాంటి పోస్టులను భర్తీ చేయకుండా కేవలం సీనియర్ ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన బాధ్యత ఎంఈఓ లపై ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత గల పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఏంటి అంటే విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, బాల్ నగర్ దుండిగల్, బాచుపల్లి, మేడిపల్లి ఘట్కేసర్ అల్వాల్ ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి మండలాలకు ఇంచార్జి ఎంఈఓ లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు ఎంఈఓ లే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మండలాలను పర్యవేక్షిస్తూ తూతూ మంత్రంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వం మారిన పరిస్థితి అదే విధంగా ఉండడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రభుత్వ పాఠశాలల మీద పేరెంట్స్ కు అంతంత మాత్రమే నమ్మకం ఉంది. ఇలా ఎంఈఓ ల పోస్టులను ఖాళీగా ఉంచితే విద్యా ప్రమాణాలు ఎలా పెంపొందుతాయని విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్ట్లను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎంఈఓ పోస్టులను వెంటనే
భర్తీ చేయాలి : సిపిఎం డిమాండ్

మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు. జిల్లాల 14 మండలాలకు ఇంచార్జ్ లే ఎంఈఓ లుగా వ్యవహరించడం అన్యాయమని ఇంచార్జిల పాలనలో విద్య ప్రమాణాలు ఎలా మెరుగు అవుతాయని నగేష్ ప్రశ్నించారు. జిల్లాకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే ఈ ప్రభుత్వంలో సైతం జరగడం శోచనీయమని తక్షణమే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు.

ఖాళీలను భర్తీ చేయకపోతే ఆందోళన చేస్తాం : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హెచ్చరిక

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ హెచ్చరించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విద్యా ప్రమాణాలను మెరుగుపరచవలసిన ఎంఈఓ ల పోస్టుల ను భర్తీ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, తక్షణమే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version