ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా పేరొందిన 194 ఏళ్ల తాబేలు ‘జోనాథన్’ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఐకాన్‌గా ప్రకటించింది. సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ తాబేలు, సుమారు 1832లో జన్మించినట్లు భావిస్తున్నారు. ఇది భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన జంతువుగా రికార్డు సృష్టించింది. సాధారణంగా ఈ జాతి తాబేళ్ల సగటు ఆయుర్దాయం 150 ఏళ్లు మాత్రమే.




