Home తెలంగాణ గౌతం నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలపై పరిశీలన

గౌతం నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలపై పరిశీలన

418
0

TGN NEWS (పటాన్‌చెరు ): డివిజన్ పరిధిలోని గౌతం నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, HMWS&SB మేనేజర్ అరుణ్ కుమార్ ఆదివారం కలిసి పరిశీలించారు.వర్షాల కారణంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించి మురుగు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకే ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నామని, అందుకోసం GHMC అధికారులతో సమిష్టిగా కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.సెలవుదినమైనప్పటికీ ప్రజల మేలు కోసం స్పందించి పర్యటనలో పాల్గొన్న HMWS&SB మేనేజర్ అరుణ్ కుమార్‌కు కార్పొరేటర్ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here