Home తెలంగాణ భారతి నగర్ డివిజన్‌లో ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకలు

భారతి నగర్ డివిజన్‌లో ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకలు

372
0
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరిజన బస్తీలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మను ముస్తాబు చేసి ఒక దగ్గర చేర్చి బతుకమ్మ ఆటలాడారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రోళ్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గణేష్, క్రాంతి కుమార్, బుడ్డోళ్ళ మోహన్ మహేష్, నరేష్, చిన్న, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
*కొంపల్లి మున్సిపాలిటీ హరిజన బస్తీలో బతుకమ్మ సంబరాలు*

TGN NEWS (పటాన్ చేరు): పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్.ఐ.జీ కాలనీ సొసైటీ ఆఫీసు ప్రాంగణంలో ఈరోజు ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని, అందులో ఎంగిలి పూవు బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆమె పేర్కొన్నారు. పూలతో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగగా బతుకమ్మ తెలంగాణ మహిళల గర్వకారణమని, దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసి రాష్ట్ర గౌరవంగా నిలిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వానిదని గుర్తుచేశారు.

 

ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతి నగర్ డివిజన్‌లో బతుకమ్మ వేడుకలు ఆనందంగా ప్రారంభమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here