హైదరాబాద్: రాజకీయ నాయకుడిగా కనిపించే కేటీఆర్‌లోని మరో సరదా కోణాన్ని బయటపెట్టింది ‘ది అండర్ 18 వరల్డ్’ టాక్ షో. చిన్నారులతో కలిసి కేటీఆర్ చేసిన సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పిల్లల కోరికతో లైవ్‌లోనే రెబల్ స్టార్ ప్రభాస్కు కేటీఆర్ ఫోన్ చేయడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌తో సంభాషణ జరుగుతుండగా ‘బాహుబలి’ బీజీఎం ప్లే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఓ చిన్నారి విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను కూడా కేటీఆర్ వెంటనే స్వీకరించారు. స్టేజ్‌పైనే పుష్-అప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇంటర్వ్యూ మధ్యలో భార్య శైలిమ నుంచి ఫోన్ రావడంతో కేటీఆర్ “ఇప్పుడు షోలో ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను” అంటూ వెంటనే కాల్ కట్ చేయడం నెటిజన్లను నవ్విస్తోంది. “భార్య ఫోన్ అంటే నాయకులూ భయపడతారేమో!” అంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
చిన్నారులు వేసిన గూగ్లీ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన స్పందనలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో విడుదల కానుంది.
