Home తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం కంటే గోకుల్ చాట్‌లోనే ఎక్కువ ఆదాయం.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలపై...

ప్రభుత్వ ఉద్యోగం కంటే గోకుల్ చాట్‌లోనే ఎక్కువ ఆదాయం.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలపై దుమారం

0

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువతకు ఉద్యోగాల కల్పనపై మాట్లాడిన ఆయన, స్వయం ఉపాధిని కూడా ఉద్యోగంగానే చూడాలని పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. “మిర్చీ, బజ్జీలు వేసుకుంటే అది ఉద్యోగం కాదా? గప్‌చుప్ బండ్లు, గోకుల్ చాట్ వంటి వ్యాపారాల దగ్గరకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. గోకుల్ చాట్ కౌంటర్ రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసినా చాలా మందికి అంత ఆదాయం రాదు” అని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాల బాధ్యతను పక్కనపెట్టి, యువతకు బజ్జీ బండ్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ వర్గాలు సమర్థిస్తున్నాయి.

దీంతో రఘునందన్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారి తీశాయి.Re

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version