Home తెలంగాణ అమెరికా టూర్‌కు కేంద్రం నో.. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కీలక మార్పులు

అమెరికా టూర్‌కు కేంద్రం నో.. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కీలక మార్పులు

0

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత అమెరికా, యూకే పర్యటనకు ప్లాన్ చేసినప్పటికీ.. అమెరికా టూర్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. యూకే పర్యటనకు మాత్రం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన నిర్దిష్ట కారణాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు. కేంద్రం నిర్ణయంపై తెలంగాణ CMO మరింత సమాచారం కోరుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు, విద్యా రంగంలో సహకారం పెంచేలా పలు కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఇందులో కీలకం.

సీఎం అమెరికా వెళ్లకపోయినా.. తన ప్రతినిధి బృందం ద్వారా MoUలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు నేపథ్యంలో ఆగస్టు 23న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి లండన్ టూర్‌పై తెలంగాణలో రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీలను సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించడం కూడా రాజకీయంగా చూడటం సరికాదని ప్రభుత్వ విప్ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version