Home జాతీయం ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ మీ దగ్గరకే!

ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ మీ దగ్గరకే!

0

విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలంటే ప్రయాణికులకు ఇబ్బందే. అయితే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ‘క్లిక్ & ట్రావెల్’ పేరుతో మొబైల్ ఇమ్మిగ్రేషన్ సేవను ప్రారంభించింది.

ఈ సేవలో ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రత్యేక మొబైల్ పరికరాలతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికులు ఉన్న చోటుకే చేరుకుని ఎంట్రీ లేదా డిపార్చర్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

మొబైల్ పరికరాలు GDRFA కేంద్ర డేటాబేస్‌లతో అనుసంధానమై ఉండటంతో ప్రయాణికుల వివరాలను అధికారులు వెంటనే యాక్సెస్ చేయగలరు. బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు నిర్ధారించిన అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. మొత్తం ప్రక్రియ కేవలం 12–15 సెకన్లలో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఎవరికి అందుబాటులో ఉంది?

డిపార్చర్ ప్రయాణికుల విషయానికి వస్తే యూఏఈ పౌరులు, నివాసితులు, సందర్శకులు సహా అందరికీ ఈ సేవ అందుబాటులో ఉంటుంది. అరైవల్ ప్రయాణికులకు మాత్రం ప్రస్తుతానికి యూఏఈ పౌరులు, నివాసితులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

విమానాశ్రయంలో రద్దీ ఒక్కసారిగా పెరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను ఎక్కువగా వినియోగించనున్నారు. దీంతో క్యూలు తగ్గడంతో పాటు ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది.

మే 2026లో పైలట్‌గా ప్రారంభమైన ‘క్లిక్ & ట్రావెల్’ సేవ ఇప్పటికే మంచి ఫలితాలను సాధించింది. ఆగస్టు 31 నాటికి 31,373 లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు GDRFA తెలిపింది.

భవిష్యత్తులో మొబైల్ పరికరాల ద్వారా మరిన్ని ఇమ్మిగ్రేషన్ సేవలను అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అనుభవం ఇక పూర్తిగా మారిపోనుంది!

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version