Home తెలంగాణ ఈ నెల 14న తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

ఈ నెల 14న తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

0

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఏబీవీపీ విమర్శించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లలో జరుగుతున్న ఆలస్యాలను నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ ప్రకటించింది. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఈ ప్రకటన చేశారు.

రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని రాంబాబు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు విడుదల చేయకపోవడంతో రూ. 11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, వేల మంది సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం కలిసి విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు మడూరి సందీప్ రావు, జూపల్లి దీపిక, ఆరిపెల్లి సుజిత్, బెల్లం కార్తీక్, వేల్పుల రాజ్‌కుమార్, గుగులోత్ నవీన్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version