TGN NEWS (జహీరాబాద్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే వారికి ప్రతి కార్యకర్త అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలనీ, ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థనాలను గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి, సీనియర్ నాయకులు కళిమ్, ఉద్యమకారుడు మున్నీర్ ఉద్దీన్, మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ , బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.