Home తెలంగాణ అధికారుల నిర్లక్ష్యం… ప్రజాధనం వృథా : ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

అధికారుల నిర్లక్ష్యం… ప్రజాధనం వృథా : ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

0

TGN NEWS (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ నుండి మొగుడంపల్లి మండల కేంద్రానికి వెళ్లే దారి పూర్తిగా పాడైందని,గత రెండు నెలల క్రితం హోతి బి గ్రామం గోవింద్ పూర్ గ్రామం మద్యన కల్వర్టు పూర్తిగా ద్వంసం అయిపోయిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం మండిపడ్డారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.. కురిసిన భారీ వర్షాల వల్ల నీళ్లు ఎక్కడిక్కడనే ఆగిపోవడంతో కల్వర్టు పాడైపోయినందున నీరంత రోడ్డుపైకి రావడం జరిగిందన్నారు. గత నెలలో ఆర్.అండ్.బి డీఈఈకి అక్కడి నుండే సమస్యను వివరించగా కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగిందన్నారు. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదన్నారు.

పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నదని, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుందని, నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మించాలని డిమాండ్ చేసారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version