Home తెలంగాణ గర్భిణీ స్త్రీలకు “మాతృదేవోభవ” కానుక : ఆవుల రాజిరెడ్డి

గర్భిణీ స్త్రీలకు “మాతృదేవోభవ” కానుక : ఆవుల రాజిరెడ్డి

0

TGN NEWS (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. హత్నుర మండలంలోని దౌల్తాబాద్, దౌలాపూర్, కాసాల, దేవులపల్లి గ్రామాలలో తొలి విడతగా 2,000 ప్రోటీన్ పౌడర్, ఐరన్ టానిక్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం 10,000 కిట్లను పేద, మధ్యతరగతి గర్భిణీ స్త్రీలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. “గర్భిణీ స్త్రీల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. పోషకాహారం లోపాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాం” అని ఆవుల రాజిరెడ్డి అన్నారు

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version