TGN NEWS (మేడ్చల్): గుండ్లపోచంపల్లి 299వ డివిజన్‌లో శుక్రవారం ప్రారంభమైన సర్ (Special Intensive Revision – SIR) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ నివాసంలో అందుబాటులో ఉండాలని, లేకపోతే ఓటరు జాబితా పరిశీలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. సరైన వివరాలతో ఫారాలను నింపి, అందులో ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని మరో ప్రతిని సంబంధిత BLOకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే స్వయంగా నిర్ణయం తీసుకోకుండా BLOలు లేదా BLAలను సంప్రదించాలని ఆయన సూచించారు. ఫారం నింపిన తర్వాత BLOకు అందజేయకపోతే ఓటు తొలగించబడే అవకాశం ఉండొచ్చని ఓటర్లకు సూచించారు. అలాగే మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను కూడా అధికారులకు తెలియజేయాలని సాయిపేట శ్రీనివాస్ కోరారు. ఈ సర్ ప్రక్రియ దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, మాజీ సర్పంచ్ బండారు నరేందర్, బేరి బాలరాజ్, శివరాజ్, బైండ్ల ప్రవీణ్, BLO శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home తెలంగాణ గుండ్లపోచంపల్లిలో సర్ ప్రక్రియకు మంచి స్పందన.. ప్రతి ఓటరు అందుబాటులో ఉండాలి: సాయిపేట శ్రీనివాస్




