Home తెలంగాణ త్వరలో మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం

త్వరలో మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం

324
0
  •  బడంగ్ పేట్ లో ముఖ్య జర్నలిస్టుల సమావేశంలో వెల్లడి
  • హాజరైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సలీమ్ పాషా, సత్యనారాయణ
  • జర్నలిస్టుల సమస్యల పరిష్కారం టీయూడబ్ల్యూజె-ఐజేయూ తోనే సాధ్యం

TGN NEWS (బడంగ్ పేట్): జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజె-ఐజేయూ కృషి ఎంతో గొప్పదని తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం డి సలీమ్ పాషా అన్నారు.బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా భవన్ లో ఆదివారం జరిగిన టియూడబ్ల్యూజే (ఐజెయు) బాలాపూర్ మండల యూనియన్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షులు ఆనంతుల శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భుజంగ్ రెడ్డి తదితరులతో కలిసి సలీమ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ల సహకారంతో జిల్లాలో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. త్వరలో నియోజకవర్గ సమావేశం నిర్వహించి, నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యంత జర్నలిస్టుల సంఘంగా మంచి గుర్తింపు ఉందని, జర్నలిస్టుల సంక్షేమమే ద్వే్యంగా ముందుకు వెళ్తామన్నారు.ఈ సందర్భంగా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ. మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కులపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ నాయకులు మహిపాల్ రెడ్డి, భూపాల్, ప్రమోద్, ఎం.అమరేశ్వర్ రెడ్డి, జయంత్, ఆర్.రమేష్, జాఫర్ భాయ్, శ్రీనివాసులు, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here