Home తెలంగాణ దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై జహీరాబాద్ పోలీసుల అవగాహన

దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై జహీరాబాద్ పోలీసుల అవగాహన

0

TGN NEWS (జహీరాబాద్): రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా పోలీసులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గురువారం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై వినయ్ కుమార్ ప్రజలను చైతన్యం చేసేందుకు ఆటోతో వివిధ కాలనీలలో ప్రచారం చేస్తున్నారు.దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ పొందుపరిచిన బ్యానర్ను ఆటోకు తగిలించి మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. పండగలకు ఊరుకు వెళ్లే వారు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version