Home తెలంగాణ ధైర్య సాహసాలను గుర్తించి ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

ధైర్య సాహసాలను గుర్తించి ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

0

TGN NEWS (వెల్దుర్తి): మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజపేట్ బ్రిడ్జ్ వద్ద గంగమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో, కొందరు ప్రజలు నీటి ప్రవాహాన్ని వీక్షించడానికి అక్కడికి చేరుకున్నారు తీవ్ర నీటి ప్రవాహం కారణంగా బ్రిడ్జ్ రెండు వైపులా ఉన్న రహదారులు దెబ్బతినడంతో, బ్రిడ్జ్‌పై దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. ఈ విషయం గమనించిన రాజపేట్ తండాకు చెందిన దేవిసింగ్ అనే యువకుడు, గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ గారి ప్రోత్సాహంతో ధైర్యంగా ముందుకు వచ్చి, తాడును ఒకవైపు చెట్టుకు కట్టి బ్రిడ్జ్‌పై చిక్కుకున్న వారి వద్దకు చేరి, దాదాపు 5 గంటల పాటు శ్రమించి వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.తన ప్రాణాలను పణంగా పెట్టి 10 మందిని రక్షించిన దేవిసింగ్ ధైర్యసాహసాన్ని గుర్తించి, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా పోలీస్ కార్యాలయంలో దేవిసింగ్‌ను, ఆయన తండ్రి శ్రీ దనూజ ని, రాజపేట్ తండా మాజీ సర్పంచ్ శ్రీ కిషన్ గారిని ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరు ఇతరులకు సహాయం చేయాలని ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒకరికొకరు సహాయపడాలని తెలిపారు. పోలీస్ ఎన్డీఆర్ ఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ డిపార్టుమెంట్ లు ఇటీవల సంభవించిన వర్షాలకు వరదలలో చిక్కుకుపోయిన 350 ప్రజల్ని కాపాడారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దేవీసింగ్ పేరును జాతీయ స్థాయిలో ధైర్య సాహసలకు అందించే పురస్కరలకు సైతం నామినేషన్ వేసే విదంగా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ.ఎస్ మహేందర్ మెదక్ డియస్పి శ్ర. డి. ప్రసన్న కుమార్ మెదక్ రూరల్ సీఐ శ్రీ. రాజా శేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version