Home తెలంగాణ యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే పనిలో పడ్డాయి : హనుమన్న గారి...

యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే పనిలో పడ్డాయి : హనుమన్న గారి నరేందర్ రెడ్డి

0

TGN NEWS (వెల్దుర్తి): యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే పనిలో పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో కంటే వెల్దుర్తి మండలానికి 23.000 బస్తాల యూరియా అదనంగా సరఫరా అయిందని తెలిపారు. కొందరు రైతులు ముందస్తుగా మందు బస్తాలను నిలువ చేసుకుంటున్నారని, అవసరం మేరకే యూరియా తీసుకోవాలని రైతులకు సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం యూరియా కొరత విషయం అందరికీ తెలుసని, అది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. యాసంగి సీజన్ కి కూడా ఎలాంటి కొరత రాదని, కొందరు కావాలని కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, జీతయ్య గారి కృష్ణ, శ్రీనివాస్ ,జంగిర్ రాములు, నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version