Home తెలంగాణ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

0

TGN NEWS (పటాన్ చేరు): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతి నగర్ డివిజన్‌లోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేష్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రజా మనిషి అన్నా అంటే నేనున్నానని ఎల్లప్పుడూ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే మా ప్రియతమ నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డి వారి జన్మదినం సందర్భంగా పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం మాకు గర్వకారణం. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దరాజు, బల్ల నర్సింగ్, భాస్కర్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాములు యాదవ్, గడ్డం కుమార్, గడ్డం మల్లేష్, కరికే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version