Home తెలంగాణ ప్రగతి నగర్‌లో బతుకమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబరాలు

ప్రగతి నగర్‌లో బతుకమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబరాలు

284
0

TGN News (ప్రగతినగర్): బతుకమ్మ పండుగ సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్‌లో మాజీ ఉపసర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సంబరాల్లో భాగంగా మహిళలు, ఆడపడుచులు బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి సాంప్రదాయ పాటలు పడుతూ నృత్యాలు చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మరికంటి భవాని, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here