Home తెలంగాణ మంజీరా హై స్కూల్‌లో దసరా–బతుకమ్మ సంబరాలు.

మంజీరా హై స్కూల్‌లో దసరా–బతుకమ్మ సంబరాలు.

405
0

TGN NEWS (పటాన్‌చెరు): నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామం మంజీరా హై స్కూల్‌లో దసరా–బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ: “దసరా, బతుకమ్మ, నవరాత్రి పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ఈ పండుగల ద్వారా సమాజంలో ఐక్యత, ఆనందం కలుగుతుంది. విద్యతో పాటు మన సంస్కృతిని తెలుసుకోవడం ఎంతో అవసరం” అన్నారు. ఆయన మంజీరా హై స్కూల్ డైరెక్టర్ జగన్ మోహన్ గత 37 ఏళ్లుగా అనేకమంది విద్యార్థులను తీర్చిదిద్దారని, తాను కూడా ఇక్కడే చదివానని గుర్తుచేసుకున్నారు. సంవత్సర కాలంలో వచ్చే ప్రతి పండుగకు సంబంధించిన స్టాల్స్, ప్రత్యేక వంటకాలు, అలంకరణలు విద్యార్థులు అందంగా ప్రదర్శించారని ప్రశంసించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, వినోదాత్మక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here