TGN NEWS (మేడ్చల్): మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని వీఎస్ఆర్ గార్డెను శనివారం బతుకమ్మలను తీసుకువచ్చి, కాలనీవాసులు బతుకమ్మ ఆడి, పాడారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి, బతుకమ్మ ఆడారు.
చిత్తూ చిత్తుల బొమ్మ, బంగారు బతుకమ్మ, ఒక్కోసి పువ్వేసి చందమామ తదితర పాటలకు లయబద్ధంగా కాళ్లు, చేతులు కదుపుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, అమ్మవారిని కొలుస్తూ పాటలు మార్మోగాయి. అనంతరం పండుగ సందర్భంగా తయారు చేసిన ప్రత్యేక వంటకాలను ఒకరికొకరు పంచుకొని, బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.
