- బాధిత కార్మికులను పరామర్శించిన దుండిగల్ మున్సిపల్ కమిషన్
- దాడికి యత్నించిన వారిపై ఫిర్యాదు నమోదు
TGN NEWS (దుండిగల్): మున్సిపల్ పరిధి బహదూర్ పల్లిలో విధి నిర్వహణలో పని చేస్తున్న ముగ్గురు పారిశుధ్య కార్మికులను ఓ టీ టైం యజమాని అతని కుమారులు విచక్షణా రహితంగా దాడి చెయ్యగా ఓ కార్మికుడు దుడ్డు సురేందర్ కి తీవ్ర గాయం కాగా దుడ్డు బాలమని, కొమ్ము వెంకటమ్మ ఇద్దరు మహిళా కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎస్ వి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్మికులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. కార్మికులపై దాడి జరిగిన సంఘటనపై సిఐటియు నాయకుడు బొడిగే లింగ స్వామి స్పందించారు. టి టైం ముందున్న రహదారిపై కార్మికులతో వారు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటలకు బహదూరపల్లి చాయ్ కేఫ్ శ్యాం టీ స్టాల్ ముందు రోడ్డుపై చెత్త వేస్తుండగా మున్సిపాల్ కార్మికుడు సురేందర్ వెయ్యొద్దని చెప్పగా మాట మాట పెరిగి శ్యామ్ తో పాటు కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులపై దాడి సంఘటనను తెలుసుకున్న కమీషనర్ వెంకటేశ్వర్ నాయక్ బాధితులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సతీష్ తెలిపారు.
