Home తెలంగాణ మేడ్చల్ పెద్ద చెరువులో శ్రేయస్ అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోండి : ఆకుల సతీష్, నల్ల...

మేడ్చల్ పెద్ద చెరువులో శ్రేయస్ అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోండి : ఆకుల సతీష్, నల్ల జయశంకర్ గౌడ్

0

 

TGN NEWS (మేడ్చల్): మున్సిపాలిటీలో సర్వే నంబర్లు 879, 881 పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/ బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. శ్రేయస్ కన్స్ట్రక్షన్ సంస్థ హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొంది చెరువులోనే నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆకుల సతీష్, నల్ల జయశంకర్ గౌడ్ ఆరోపించారు. అదనపు కలెక్టర్‌కు, మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.

ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు 100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు. ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version