Home తెలంగాణ మేడ్చల్ 299 డివిజన్‌లో అక్రమ నిర్మాణాల జోరు.. GHMC అధికారుల మౌనంపై విమర్శలు…!

మేడ్చల్ 299 డివిజన్‌లో అక్రమ నిర్మాణాల జోరు.. GHMC అధికారుల మౌనంపై విమర్శలు…!

0
  • “మేడ్చల్ 299లో అక్రమ కట్టడాల జోరు!”
  • “నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు..!”
  • “అనుమతులు లేకుండానే కమర్షియల్ షెడ్లు!”
  • “GHMC ఆదాయానికి గండి?”
  • “చిరు వ్యాపారులపైనే చర్యలా..? ధనవంతులకు చర్యలు ఉండవా…?”

TGN NEWS (మేడ్చల్): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 299వ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎలాంటి అధికారిక అనుమతులు పొందకుండా తాత్కాలిక (టెంపరరీ) షెడ్లు నిర్మించి వాటిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా GHMCకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోందని వారు అంటున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు.

రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారులు, చిరు దుకాణాలపై అధికారులు తరచూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై అదే స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన తర్వాత మాత్రమే సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని, అయితే వాటి తర్వాత కూడా అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు కనిపించడం లేదని, నోటీసులు అందిన తర్వాత నిర్మనదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అంశంపై GHMC ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version