TGN NEWS (రామచంద్రాపురం): రామచంద్రపురం డివిజన్‌లోని మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బతుకమ్మ, దసరా, జమ్మి పూజ, రావణదహనకండ కార్యక్రమాల తేదీలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, గ్రామ పురోహితులు బాలకృష్ణ పంతులు మరియు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, అన్ని కులస్తుల పెద్దల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో అందరి అంగీకారంతో కార్యక్రమాల తేదీలను ఖరారు చేశారు.
📌 తేదీలు & సమయాలు:
బతుకమ్మ : సెప్టెంబర్ 29 సాయంత్రం 05:30 గంటలకు
దసరా, జమ్మి పూజ : అక్టోబర్ 2 సాయంత్రం 05:35 గంటలకు
రావణదహనకండ : అక్టోబర్ 2న దసరా.
ఈ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, నాయకులు, అన్ని సంఘాల కులస్తులు పాల్గొననున్నారు.
