Home తెలంగాణ రాష్ట్రపతి చేతుల మీదుగా ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్‌కు జాతీయ అవార్డు..

రాష్ట్రపతి చేతుల మీదుగా ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్‌కు జాతీయ అవార్డు..

0

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ సినిమా టీమ్‌ అవార్డును అందుకుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు.

‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ, మేకప్‌ ఆర్టిస్ట్‌ రవి కుమార్‌ పసుపులేటి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా పింక్‌ ఎలిఫెంట్‌ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది. అవార్డు అందుకున్న క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ఇది తమ టీమ్‌కు గర్వకారణమైన, భావోద్వేగంతో కూడిన రోజని పేర్కొంది.

ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో పలువురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటులుగా మమ్ముట్టి (‘భ్రమయుగం’), కార్తిక్‌ ఆర్యన్‌ (‘చందూ ఛాంపియన్‌’) పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌ (‘ఆర్టికల్‌ 370’) అవార్డు దక్కించుకున్నారు.

దిగ్గజ నటుడు అనంత్‌ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారం అందుకుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వినీదత్‌ ఈ అవార్డును స్వీకరించారు.

‘పుష్ప 2’ చిత్రంతో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సుకుమార్‌ అవార్డు అందుకున్నారు. ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ధనుష్‌కు స్పెషల్‌ మెన్షన్‌ దక్కింది. ‘పుష్ప 2’కు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా దీపాలి నూర్‌, సీతల్‌ శర్మ పురస్కారాలు అందుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version