హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.
ప్రధానాంశాలు:
- కూకట్పల్లి, ఆల్వాల్, బాలానగర్‌లో భారీ వర్షం
- మల్కాజిగిరి, బోయిన్పల్లి, అంబర్‌పేటలో జలమయం
- కోఠి, లక్డీకాపూల్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు
- షేక్‌పేటలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాల సూచన
- 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- మరో 20 జిల్లాలకు భారీ వర్ష సూచన
- అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
- 24 గంటలు కంట్రోల్ రూమ్‌లు, సహాయక బృందాలు అందుబాటులో ఉండాలని సూచన
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.
