Home తెలంగాణ విజయవాడ డీసీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

విజయవాడ డీసీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

0

విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫీఫా (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో అఫీఫా కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. “ఉజ్వల భవిష్యత్తు ఉన్న అఫీఫా ఇంత చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. డీసీపీ షరీన్ బేగంకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి” అని పేర్కొన్నారు.

ఆదివారం అఫీఫా తన స్నేహితులతో కలిసి కారులో చీరాల బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. గుంటూరు జిల్లా యెటుకూరు వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వీరి కారు వేగంగా వెళ్లి దానిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో అఫీఫా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version