Home తెలంగాణ విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగాలీ : ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్

విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగాలీ : ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్

0

TGN NEWS (పటాన్‌చెరు): ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైఫ్ సైన్స్ విద్యార్థులు ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ — “విద్యార్థులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే గమ్యాన్ని చేరుకోగలరు. విద్య అనేది కేవలం నాలుగు గోడల మధ్య పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం అవసరమైన సామాజిక స్పృహ, నైపుణ్యాలు కూడా సాధించాలి” అని సూచించారు. అలాగే, ఈ కళాశాల కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను మించి వసతులు కలిగి ఉందని, 25 ఏళ్లకు పైగా బోధన అనుభవం ఉన్న అంకితభావంతో కూడిన అధ్యాపక వర్గం విద్యార్థులకు మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ యోగి బాబు, డాక్టర్ పూనంకుమారి, డాక్టర్ మల్లిక, డాక్టర్ సురేష్ విద్యార్థులకు సందేశమిస్తూ —“మూడేళ్ల కాలాన్ని క్రమశిక్షణతో, కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలో డాక్టర్ షరీఫ్, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కరుణాకుమారి, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ సుజాత తదితర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version