గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు భాజపా నాయకులు చర్యలు చేపట్టారు. ఈ రోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎన్. యాదగిరి గారిని భాజపా నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రంలో ముఖ్యంగా పలు కాలనీలలో వంకరగా నిలిచిన పాత విద్యుత్ స్థంబాలు,విద్యుత్ స్తంభాలనుండి కరెంట్ వైర్లు బయటకు రావడం, చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు వంటి సమస్యలను గుర్తు చేశారు. ఈ పరిస్థితులు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ఇప్పటికే కొన్ని అపాయ సంఘటనలు కూడా జరిగినట్టు తెలిపారు. ఈ తరహా ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో భాజపా గుండ్లపోచంపల్లి అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జైతువాలా కిషన్, చింతలపూడి రామారావు, భాజపా నాయకులు బట్టికడి నవనీత, పిడుగుల నాగరాజ్, సుంకు నవీన్, ప్రవీణ్ గౌడ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
