Home తెలంగాణ శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

0
  • మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు

TGN NEWS (అమీన్ పూర్):  పెద్ద చెరువు వద్ద శ్రీ దుర్గా భవాని మాత సహిత శ్రీ నాగ లింగేశ్వర దేవాలయంలో నేటి నుండి ప్రత్యేక పూజలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద శ్రీ దుర్గా భవాని మాత సహిత శ్రీ నాగ లింగేశ్వర దేవాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, శ్రీ దుర్గాభవాని ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాలు ఈసారి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రోజువారీగా ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి ఆరాధన, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాంతీయ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తారు. అక్టోబర్ 4న మహా నిమజ్జనంతో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. గత 15 ఏళ్లుగా నిరవధికంగా జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు ప్రాంత ప్రజలకు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు అన్ని వయసుల వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గ భవాని ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version