Home తెలంగాణ సబ్సిడీపై సన్నవడ్ల విత్తనాలు పంపిణీ: రేవంత్

సబ్సిడీపై సన్నవడ్ల విత్తనాలు పంపిణీ: రేవంత్

0

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనస్ అందించే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచి, రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం, సన్న వడ్లు సాగు చేసే రైతుల డేటాను సేకరించాలని ఆదేశించారు. వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచాలని, అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా నియమించాలని సూచించారు. విత్తనాలు, వడ్ల కొనుగోళ్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకోవాలని, అన్ని రకాల ఎరువులకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version