Home తెలంగాణ సమస్యలు పరిష్కరించాలని పీర్జాదిగూడ కమిషనర్ కు మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లా రెడ్డి...

సమస్యలు పరిష్కరించాలని పీర్జాదిగూడ కమిషనర్ కు మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లా రెడ్డి వినతి పత్రం

0
  •  దసరాలోపు ప్రజలకు మంచినీళ్ళు అందించి దప్పిక తీర్చండి…
  • గుంతలు పడ్డ రోడ్లను మరమ్మతులు చేయండి..
  •  స్థానిక సమస్యలపై పీర్జాదిగూడ కమిషనర్ కి వినతిపత్రం అందజేస్తున్న మాజీ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి.

TGN NEWS (పీర్జాదిగూడ): నగర ప్రజలకు దసరాలోపు మంచినీళ్ళు అందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పీర్జాదిగూడ కమిషనర్ త్రిళేశ్వర్ రావుకు మాజీ మంత్రి,మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లా రెడ్డి, మాజీమేయర్ జక్క వెంకట్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ నగరంలోని పలు కాలనీలలో ప్రజలు ఏదురుకుంటున్న సమస్యలపై మాజీ కార్పొరేటర్లు, ప్రజలు, స్థానిక నాయకులతో కలిసి కమిషనర్ త్రిలేశ్వర్ రావుకి కలిసి వినతిపత్రం అందజేసారు.

ఆయన మాట్లాడుతూ దసరా పండుగ లోగ ప్రజలకు మంచినీళ్లు అందించాలని అవసరమైన చోట నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని,సిసి రోడ్డు, డ్రైనేజి వంటి మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పనులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.కమీషనర్ సానుకూలంగా స్పందంచారని అన్ని పనులకు టెండర్ వేశారని, మన సమస్యలు అన్ని ముందే అంచనా వేశారని దసరా లోపు అన్ని పనులు పూర్తిచేస్తారని తనదైన శైలిలో అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతురి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, జావీద్ ఖాన్,జిలాని పాషా, కోనేటి వెంకట్, యాసారంశ్రీనివాస్, అమర్ పటేల్, బత్తుల కిరణ్ వివిధ కాలనీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version