TGN NEWS (మేడ్చల్): స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సింగిరెడ్డి మాధవరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధి గౌడవెల్లి లోని మాధవరెడ్డి చౌరస్తా లో సింగిరెడ్డి మాధవరెడ్డి విగ్రహానికి వారి తనయుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాధవ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ బి బ్లాక్ మండల మున్సిపల్ అధ్యక్షులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, అనుబంధ సంస్థల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
