Home తెలంగాణ నిండుకున్న జహీరాబాద్ నారింజ ప్రాజెక్ట్

నిండుకున్న జహీరాబాద్ నారింజ ప్రాజెక్ట్

0

TGN NEWS (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నారింజ ప్రాజెక్టు నిండుకుంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో నారింజ బారేజ్ రెండవ గేట్ ను 5 అడుగుల వరకు లిఫ్ట్ చేశారు. 4358 క్యూసెక్కుల నీరు బ్యారేజ్ లోకి వచ్చి చేరుతుండగా 4236 క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు. అదే విధంగా మండలంలోని దిడిగి గ్రామ చెరువు కింద ఉన్న నివాస సముదాయలలోకి నీరు చేరుతుండడంతో ఇరిగేషన్ అధికారులు మత్తడికి అడ్డంకిగా ఉన్న మట్టి దిబ్బలను తొలగించడం, సర్ ప్లస్ కోర్స్ ను వెడల్పు చేసి నీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇరిగేషన్ ఏఇ జానకిరామ్, వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, గ్రామం కార్యదర్శి, గ్రామస్థులు సోమప్ప, నర్సిములు, లస్కర్లు పాండు, షౌకత్ మియా తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version