TGN NEWS (జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం చాల్కి గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌసియా బేగం అనారోగ్య సమస్య రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.చికిత్స నిమిత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుందని వైద్యులు తెలుపడంతో బాధితురాలికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డిని సంప్రదించగా తక్షణమే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లుభవనాల శాఖ మంత్రి.కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సహాకారంతో బాధితురాలు మొహమ్మద్ గౌసియా బేగంకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల యాభై వేల రూపాయలను మంజూరు చేయించారు. ఎల్ఓసీని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దం.ఉజ్వల్ రెడ్డి చేతుల మీదుగా బాధితులు మొహమ్మద్ గౌసియా బేగం, మొహమ్మద్ మహాబూబ్ కుటుంబ సభ్యులకు కీ అందించారు. సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, సత్వార్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మాజీ వైస్ యంపిపి రాములు, యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,యూత్ న్యాల్కల్ మండల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సీనియర్ నాయకులు భీమయ్య,వెంకట్ రెడ్డి, అశ్విన్ పాటిల్,ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
