- రంగాయపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చుట్టు చేరిన మురుగునీరు

గ్రామంలోని మురుగు నీరు ద్వారా రోడ్డు గుండా వదిలేయడంతో పాఠశాల చుట్టూ మురుగు నీరు చేరి విద్యార్థులకు వాసనా వస్తుందని విద్యార్థులూ వారి గోడుని వినిపించారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం, గ్రామంలోని మురుగు నీరు మొరిలా ద్వారా రోడ్డు గుండా వదిలివేయడం జరిగింది. దింతో రంగాయపల్లి గ్రామ శివారులో ఉన్నా ప్రభుత్వజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ మురుగు నీరు చుట్టూ చేరి అక్కడే నీరు నిలవడం జరుగుతుంది. దీంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయాలంటే పాఠశాల చుట్టూ మురుగు, వాసన, దోమలు రావడం జరుగుతుందని తెలిపారు. దీంతో అలాగే ఆ మురుగు నీరు వల్ల దోమలు వాసన ఇబ్బంది వల్ల తరగతి గదులకు వంటగదులకు ఇబ్బంది కలుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. అధికారులు స్పందించి పాఠశాల చుట్టూ చేరిన మురుగు నీరుని తొలగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధ్యాయులు కోరుచున్నారు.