భారత ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో భాగంగా సోమవారం స్లోవేకియా రాజధాని బ్రటిస్లావా చేరుకున్నారు. అక్కడ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని రాబర్ట్ ఫికోలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడుల విస్తరణ అవకాశాలపై చర్చలు సాగాయి. 1993లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీనే కావడం విశేషం. బ్రటిస్లావాలో వెల్కమ్ సందర్భంగా లుక్నికా బృందం వందేమాతరం ఆలపించింది.

