Home తెలంగాణ కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్ప గాయం.. ఆసుపత్రికి కేసీఆ

కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్ప గాయం.. ఆసుపత్రికి కేసీఆ

20
0

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. నిన్న సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అతడి ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

కుమారుడికి గాయమైందన్న సమాచారం అందుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావుతో కలిసి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై వారు వైద్యులను అడిగి ఆరా తీశారు. మనవడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పరామర్శించేందుకు ఆసుపత్రికి బయలుదేరారు.Himanshu Rao minor injury KCR visits hospital

కోలుకుంటున్నాను: హిమన్షు

తాను కోలుకుంటున్నానని హిమాన్షు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. చిన్నపాటి గాయం కావడంతో గత రాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిమాన్షుకు చిన్నపాటి గాయమైందని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని కేటీఆర్ కూడా సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీసిన వారికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here