ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చి నేటితో పదేళ్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆ సమయంలో మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకోలేకపోయిందన్నారు.
అయితే కేసీఆర్ చొరవ, దౌత్యంతో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్‌డీఎస్‌ఏ (NDSA)ను సాకుగా చూపిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.





