Home తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ రోజున మూగబోయిన గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కార్యాలయం

స్వాతంత్ర్య దినోత్సవ రోజున మూగబోయిన గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కార్యాలయం

162
0

స్వాతంత్ర్య దినోత్సవ రోజున మూగబోయిన గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కార్యాలయం

గుండ్లపోచంపల్లి: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కార్యాలయం మాత్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మున్సిపాలిటీగా కొనసాగిన కాలంలోనూ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించే ఆనవాయితీ కొనసాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికుల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ పర్వదినాలను నిర్వహించేవారు.

అయితే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ GHMCలో విలీనం అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 299 డివిజన్ కార్యాలయం వద్ద ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కనీసం జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగరేయకపోవడానికి కారణమేంటి?
స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పర్వదినం సందర్భంగా అధికారిక కార్యక్రమం ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఇదే కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన జాతీయ పర్వదినాల వేడుకలు ఇప్పుడు ఎందుకు కనిపించడంలేదో అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ పర్వదినాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని 299 డివిజన్ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here