Home తెలంగాణ కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ‘మా ఫొటోలను AIతో మార్ఫింగ్ చేస్తున్నారు’

కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ‘మా ఫొటోలను AIతో మార్ఫింగ్ చేస్తున్నారు’

7
0

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. రేవంత్‌ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్యలపై చర్చించలేక తమపై కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమ ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావుపై కేసుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీషర్ట్‌లు విప్పారనే అంశంపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటూ వారిపై కేసులు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసులు, ఆరోపణలు, అసెంబ్లీలో ఆందోళనల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here