Home తెలంగాణ పటాన్‌చెరులో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

పటాన్‌చెరులో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

381
0

TGN NEWS (పటాన్ చేరు): భారతీయ శిల్పకారుడు, సృష్టికర్త విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద యువజన సేవ సమితి ఆధ్వర్యంలో, అలాగే జేపీ కాలనీలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –“విశ్వకర్మ జయంతి ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని, కృషి ప్రేరణను అందించే ప్రత్యేక దినం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని విస్తరించి, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అభివృద్ధి సాధించాలి” అని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి భారతీయ సంస్కృతిలో పవిత్రమైన పండుగగా గుర్తించబడింది. శిల్పకారులు, యంత్రకారులు, ఇంజనీర్లు, వృత్తిపరులు ఈ రోజు తమ పరికరాలను పవిత్రం చేసుకుని, ఉత్తమ పనితీరుకు సంకల్పం తీసుకుంటారు. కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, రుద్రారం శంకర్, చందు, యువజన సేవ సమితి అధ్యక్షులు విజయ్, రాజు గౌడ్, వీరేశ్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే యువజన సేవ సమితి సభ్యులు, MDR యువసేన సభ్యులు విశేషంగా సహకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here